Monkey pox: కేరళలో మంకీపాక్స్ భయం.. రెండో కేసు నమోదు

by vinod kumar |
Monkey pox: కేరళలో మంకీపాక్స్ భయం.. రెండో కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇటీవల మలప్పురంలో ఈ వైరస్ సోకి ఒకరు మరణించగా..తాజాగా అదే జిల్లాలో మరో కేసు వెలుగు చూసింది. దుబాయ్ నుంచి వచ్చిన 38ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. మలప్పురంకు చెందిన వ్యక్తి ఈ మధ్యే దుబాయ్ నుంచి వచ్చారు. దీంతో వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు అక్కడి నుంచి మంజేరీ మెడికల్ కళాశాలకు తరలించారు. అతని నమూనాలను పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజ్ ల్యాబ్‌కు పంపగా మంకీపాక్స్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స ప్రారంభించారు. వ్యక్తి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఒంటరిగా ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని వీణాజార్జ్ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని వెల్లడించారు. వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed