- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూపీఏ హయాంలో రైతుల నిధుల లూటీ : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా శరద్‌పవార్ ఉన్న టైంలో మహారాష్ట్రలోని విదర్భ రైతులకు మంజూరు చేసిన కోట్లాది నిధులు మధ్యలోనే మాయమయ్యాయని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై ఫైరయ్యారు. యూపీఏ హయాంలో పేదలు, రైతులు, ఆదివాసీలకు ఆసరా దొరకలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మహారాష్ట్రలోని రైతుల ఖాతాలకు రూ.3,800 కోట్లు బదిలీ చేసిందని ప్రధాని మోడీ తెలిపారు. ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం దశాబ్దాలుగా దేశంలోని 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిలుపుదల చేసింది. మేం వాటిలో 60 ప్రాజెక్టుల పనులను పూర్తి చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మన దేశంలోని ఒక్కో గ్రామంలో సగటున 100 కుటుంబాలలో 15 కుటుంబాలకు మాత్రమే నల్లాల ద్వారా సురక్షిత నీటి సరఫరా జరిగేది. మేం గత పదేళ్లలో చేసిన పని వల్ల ప్రస్తుతం ఒక్కో పల్లెలోని ప్రతి 100 కుటుంబాలకుగానూ 75 కుటుంబాలకు నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది’’ అని ప్రధాని వివరించారు.