- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narendra Modi : బీజేపీ ముఖ్యనేతలతో మోదీ కీలక భేటీ
దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీఫైనల్‌గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుంది. దీంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీని గెలిపించేందుకు నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు.
శుక్రవారం రాత్రి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొననున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై చర్చించే అవకాశముంది. అభ్యర్థుల జాబితా ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. దీంతో రేపు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 30-40 అభ్యర్థులతో టీ బీజేపీ తొలి జాబితా సిద్దమైంది. ఏ క్షణమైనా జాబితాను విడుదల చేసే అవకాశముంది. మోదీ ఈ సమావేశంలో పాల్గొనడం కీలకంగా మారింది.