విశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే మోడీ చెప్పగలరు: రాహుల్ గాంధీ

by Mahesh |
విశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే మోడీ చెప్పగలరు: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. కాలిఫోర్నియా వేదికగా మరోసారి ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. భారత ప్రధాని మోడీని.. దేవుని పక్కన కూర్చోబెడితే.. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో.. ఆ దేవునికే చెప్పడం ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అమెరికాలో భారతీయ జెండాను పట్టుకున్నందుకు భారతీయ ప్రవాసులకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన రాహుల్ వివిధ కార్యక్రమాల్లో పాల్గోననున్నారు.

Advertisement

Next Story