కంటతడి పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

by Rani Yarlagadda |   ( Updated:2024-10-10 08:27:33.0  )
కంటతడి పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
X

దిశ, వెబ్ డెస్క్: బిజినెస్ టైకూన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) (Ratan Tata) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంపట్ల యావత్ భారతావని దిగ్భ్రాంతి చెందింది. ఆయన లేని లోటు దేశానికి తీర్చలేనిదంటూ కన్నీరు పెట్టింది. రతన్ టాటా స్థాపించిన, అభివృద్ధి చేసిన కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఆయన ఎంతోమందికి జీవితాన్నిచ్చారు. అలాంటి వ్యక్తి మరణించడం అందరినీ కలచివేసింది.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సైతం రతన్ టాటా మరణవార్త పై చింతించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చాలా సంవత్సరాల క్రితం ఆయన తన ఇంటికి వచ్చారని, బ్రేక్ ఫాస్ట్ సమయంలో.. ఒక దోస, ఇడ్లీ, వడ , సాంబార్ మాత్రమే తిన్నారని చెప్పారు. ఆయన సాధారణ జీవితం గడుపుతూనే చాలా సంతోషంగా ఉంటారనే విషయం అప్పుడే తనకు అర్థమైందన్నారు పీయూష్ గోయల్. ఇంటి నుంచి వెళ్లిపోయేముందు తన భార్య మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకుని అడగకుండానే ఫొటో ఇచ్చారని చెప్పారు. అంత గొప్పవ్యక్తితో ఎవరైనా కొన్ని నిమిషాలు గడపాలని కోరుకుంటారని.. ఆ రోజు ఆయనతో గడిపిన ప్రతీక్షణం తనకొక మధురమైన జ్ఞాపకమని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed