- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
భారత్‌లోని ఒక్క ముస్లింను కూడా మోడీ ఎందుకు కౌగిలించుకోరు..? OYC ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయం అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు భారతదేశంలో నివసించడానికి లేదా మా విశ్వాసాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వడానికి మోహన్ భగవత్ ఎవరు అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రికలైన ఆర్గనైజర్, పాంచజన్య పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ బుధవారం రియాక్ట్ అయ్యారు.
మా పౌరసత్వంపై షరతులు పెట్టడానికి మోహన్ ఎవరు అని నిలదీశారు. అల్లా కోరుకున్నాడు కాబట్టే మనందరం భారతీయులం అయ్యామన్న ఒవైసీ.. మా విశ్వాసాన్ని సర్దుబాటు చేయడానికో నాగ్ పూర్ బ్రహ్మచారులను సంతోషపెట్టడానికో మేము ఇక్కడ లేమన్నారు. ఓ వైపు సొంత దేశంలోని ప్రజల మధ్య విభజన పెంచేందుకు బీజీగా ఉంటూనే మరో వైపు భారత దేశం ప్రపంచానికి వసుదైక కుటుంబం అని చెప్పలేరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాల ముస్లిం నాయకులందరినీ కౌగిలించుకుంటారు కాని తన దేశంలోని ఒక్క ముస్లింను కూడా ఎందుకు కౌగిలించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం బాహ్య వైపు నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు లేదన మోహన్ చెప్పారు.
ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా అంతర్గత శత్రువులు, యుద్ధ స్థితి గురించే విలపిస్తోందన్నారు. గతంలో అఖండ భారతావనిగా ఉన్న ఇండియా ప్రధానమైన హిందూత్వ భావాన్ని మరచిన ప్రతిసారీ విభజనకు గురైందని ఇప్పుడు స్వయం సేవకుల చేతికి రాజకీయ అధికారం వచ్చిందని భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. బార్డర్ లో చైనా దేశ భూభాగాని ఆక్రమిస్తుంటే స్వయంసేవక్ సర్కార్ గత ఎనిమిదేళ్లుగా నిద్రపోతోందా అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని ఆరోపించిన ఒవైసీ. నిజమైన 'అంతర్గత శత్రువులను' భారతీయులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని చెప్పారు. మతం పేరుతో ఇలాంటి ద్వేషాన్ని, రాడికలిజాన్ని ఏ సమాజం సహించదన్నారు.