Mehbooba Mufti: బీజేపీని అడ్డుకునేందుకే ఎన్నికల్లో పోటీ.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ

by vinod kumar |
Mehbooba Mufti: బీజేపీని అడ్డుకునేందుకే ఎన్నికల్లో పోటీ.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ పార్టీ కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కశ్మీర్ సమస్యను, ఆర్టికల్ 370ని అంతం చేయకుండా బీజేపీని అడ్డుకునేందుకే ఎన్నికల బరిలో నిలిచామని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. కశ్మీర్ సమస్యలను పక్కదారి పట్టించి ప్రతి ఒక్కరూ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఆదివారం ఆమె కుల్గామ్‌లో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ సమస్యలను పరిష్కరించడం ఎంతో ముఖ్యమని, అందుకు గాను పీడీపీ మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. దాదాపు ఒక దశాబ్దం పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడంలో బీజేపీ విఫలమైందన్నారు. బీజేపీ తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం కావాలన్నారు. పీడీపీ అధికారంలోకి వస్తే దినసరి కూలీలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బహుళ జాతి కంపెనీలను కశ్మీర్‌కు తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed