'సింగిల్‌గానే వెళ్తాం'.. లోక్‌సభ ఎన్నికలపై బీఎస్పీ క్లారిటీ

by Vinod kumar |
సింగిల్‌గానే వెళ్తాం.. లోక్‌సభ ఎన్నికలపై బీఎస్పీ క్లారిటీ
X

లక్నో : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోల్స్‌లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ప్రకటించారు. గత ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు తమ పార్టీ ఓట్లు భాగస్వామ్య పక్షాలకు పడ్డాయని, కానీ వాళ్ల ఓట్లు బీఎస్పీకి బదిలీ కాలేదని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఒంటరిగా పోటీ చేసేందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో బీఎస్పీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటామని, సమాజంలోని అన్నివర్గాలనూ కలుపుకొని పోతామన్నారు. పార్టీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన ఆదేశాల పురోగతిపై మాయావతి బుధవారం సమీక్షించారు. త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని గత నెలలోనే బీఎస్పీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో బీఎస్‌పీ 10 లోక్ సభ సీట్లు గెలుచుకోగా, రాజ్యసభలో ప్రస్తుతం ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు.

Advertisement

Next Story