మాస్క్ లు తప్పనిసరి.. మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలి : కోవిడ్‌పై సమీక్షలో అధికారులకు మోదీ ఆదేశం

by Shiva |   ( Updated:2023-03-22 15:13:08.0  )
మాస్క్ లు తప్పనిసరి.. మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలి : కోవిడ్‌పై సమీక్షలో అధికారులకు మోదీ ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కోవిడ్, ఇన్‌ఫ్లూ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కేసులు, ఇన్‌ఫ్లూ పరిస్ధితిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదర్శన రూపంలో వివరించారు. మార్చి 22 తో ముగిసిన వారంలో సగటున 888 రోజువారీ కేసులు నమోదవగా, పాజిటివ్ రేటు 0.98 శాతంగా పెరిగిందని ఆయన ప్రధానికి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1.08 లక్షల రోజువారీ కేసులు నమోదయ్యాయి.

22 డిసెంబర్ 2022న జరిగిన చివరి కోవిడ్ 19 సమీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను కూడా ఈ భేటీలో అధికారులు వివరించారు. అలాగే ప్రధానమైన 20 కోవిడ్ డ్రగ్స్, ఇతర డ్రగ్స్ 12, బఫర్ డ్రగ్స్ 8, ఇన్‌ఫ్లూయెంజా డ్రగ్ లభ్యత, ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. దేశంలోని ఇన్‌ఫ్లూయెంజా పరిస్ధితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. INSACOG Genome Sequencing Laboratoriesలలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మెరుగుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని వల్ల కొత్త వేరియంట్‌లు ఏమైనా వుంటే వాటి ట్రాకింగ్‌‌కు, సకాలంలో ప్రతిస్పందనకు మద్ధతుగా ఉంటుందన్నారు. రోగులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలో మాస్క్‌లు ధరించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలని మోడీ సూచించారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రధాని కోరారు.

ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19, అడెనో వైరస్‌లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, పడకలు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిందిగా ప్రధాని సూచించారు. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగిసిందని, దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. టెస్ట్ , ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ 19 వంటి ఐదెంచల వ్యూహంపై దృష్టి సారించాలని మోడీ పేర్కొన్నారు.

అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (SARI) కేసుల ల్యాబ్ నిఘా, పరీక్షలను మెరుగుపరచాలని ప్రధాని ఆదేశించారు. దేశంలోని ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులకు సిద్ధంగా వున్నాయని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలని మోడీ సూచించారు. ఈ హైలెవల్ సమావేశానికి ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, ఐసీఎంఆర్ డీజీ, పీఎంవో సలహాదారు అమిత్ ఖరే‌లు హాజరయయారు.

Advertisement

Next Story

Most Viewed