- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవాలో బీజేపీ కి షాక్.. పార్టీని వీడిన మనోహర్ పారికర్ తనయుడు
పనాజీ: గోవాలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను కోరిన స్థానంలో టికెట్ కేటాయించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 'నేను పార్టీ సభ్యులందరి మద్దతును మాత్రమే కాకుండా, పనాజీలో సాధారణ ప్రజల మద్దతును కూడా ఆస్వాదించాను. నా పార్టీని ఒప్పించేందుకు గతంలో, ఈ ఎన్నికల సమయంలో కూడా నా వంతు ప్రయత్నం చేశాను' అని మీడియాకు తెలిపారు.
తనను కాదని రెండేళ్ల క్రితం పార్టీ తో కూడిన వ్యక్తి కి టికెట్ ఇవ్వడంతో స్వతంత్రంగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, గురువారం గోవాలో 34 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి విడత జాబితా విడుదల చేశారు. దీనిలో ఉత్పల్‌కు చోటు దక్కలేదు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ స్థానాన్ని కేటాయించాలని ఆయన బీజేపీని పట్టుబట్టారు. దీనికి బదులుగా బీజేపీ వేరే రెండు స్థానాలను సూచించింది. అయితే ఉత్పల్ వాటిని నిరాకరించారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో వచ్చే నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.