- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో సీబీఐ అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీలో ఉన్నంత మాత్రన నేరుగా సుప్రీంకోర్టుకే రావటమేనా అని మండిపడింది.
అనేక అవకాశాలు ఉన్నప్పటికీ నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. ఈ అంశంలో హైకోర్టును ఆశ్రయించాలని సూచించించింది. ఈ కేసులో సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేయగా నిన్న ఐదు రోజుల పాటు అతడిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. తన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో మనీష్ సిసోడియా ఉన్నట్టు తెలుస్తోంది.