Manipur Violence : మణిపూర్ హింసాకాండపై కీలక ప్రకటన.. విచారణ కమిటీ నివేదిక సమర్పించే గడువు పొడిగింపు

by Hajipasha |
Manipur Violence : మణిపూర్ హింసాకాండపై కీలక ప్రకటన.. విచారణ కమిటీ నివేదిక సమర్పించే గడువు పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో గతేడాది మే నుంచి కొన్ని నెలల పాటు జరిగిన దారుణ హింసాకాండపై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ విచారణ నివేదిక సమర్పించేందుకు ఉద్దేశించిన గడువు తేదీని నవంబరు 20 వరకు పొడిగించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గతేడాది జూన్ 3న కేంద్రం ఏర్పాటుచేసిన ఈ విచారణ కమిటీకి గువహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా సారథ్యం వహిస్తున్నారు. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్, రిటైర్డ్ ఐపీఎస్ అలోకా ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. మణిపూర్ హింసాకాండలో కొన్ని వర్గాల వారిని ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు ? కారణాలు ఏమిటి ? హింసాకాండ ఎలా వ్యాపించింది ? అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed