Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. ఆయుధాలను దోచుకెళ్లే యత్నం

by Vinod kumar |
Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. ఆయుధాలను దోచుకెళ్లే యత్నం
X

ఇంఫాల్ : మణిపూర్‌లో మిలిటెంట్ల ఆగడాలు ఆగడం లేదు. థౌత్‌ బాల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఉన్న 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB) క్యాంపు కార్యాలయంపై దాదాపు 500 మంది అల్లరి మూకలు దాడికి తెగబడ్డారు.. అక్కడి నుంచి ఆయుధాలను దోచుకెళ్లే యత్నం చేశారు.. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. అనివార్య పరిస్థితుల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు(27) మృతిచెందగా, 12 మందికి గాయాలయ్యాయి.

“సైనిక దళాల కదలికను నిరోధించడానికి ఆ అల్లరి మూక IRB క్యాంపు చుట్టూ రోడ్‌ను బ్లాక్‌ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు అల్లరి మూకను చెదరగొట్టి, అక్కడి నుంచి వెళ్ళగొట్టాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి” అని ఆర్మీ పేర్కొంది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ గొడవలు కొనసాగాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థౌత్‌బాల్ జిల్లాలో కర్ఫ్యూ సడలింపును రద్దు చేశారు.

Advertisement

Next Story

Most Viewed