Internet Ban : ఇంటర్నెట్ బ్యాన్ మరో ఐదు రోజులు పొడిగింపు

by Hajipasha |
Internet Ban : ఇంటర్నెట్ బ్యాన్ మరో ఐదు రోజులు పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ బ్యాన్‌ను ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అప్పటివరకు ఆయా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్, మొబైల్ డాటా, వీశాట్, వీపీఎన్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. తొలుత సెప్టెంబరు 10న ఈ ఐదు జిల్లాల్లో ఐదు రోజుల వ్యవధి కోసం ఇంటర్నెట్ బ్యాన్‌ను ప్రకటించారు.

అయితే పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో బ్యాన్‌ను మరో ఐదు రోజులు పొడిగించారు. గత కొన్ని వారాల వ్యవధిలో మణిపూర్‌‌లో తీవ్రవాద గ్రూపుల ఆగడాలు పెచ్చుమీరాయి. ఏకంగా భద్రతా బలగాలు లక్ష్యంగా ఆయా గ్రూపులు దాడులకు తెగబడ్డాయి. దీంతో వాటిపై ఉక్కుపాదం మోపే లక్ష్యంతో ఇంటర్నెట్ బ్యాన్‌ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు ఆయా తీవ్రవాద గ్రూపుల స్థావరాలను ధ్వంసం చేసే ఆపరేషన్‌‌ను మొదలుపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed