Snakes on a plane: బ్యాంకాక్ నుంచి 10 అనకొండల అక్రమ రవాణా.. బెంగళూరులో చిక్కాడు

by Disha Web Desk 14 |
Snakes on a plane: బ్యాంకాక్ నుంచి 10 అనకొండల అక్రమ రవాణా.. బెంగళూరులో చిక్కాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల మాదిరిగా ఇండియాలో కూడా అనకొండల్ని పెంచుకోవడం ట్రెండ్‌గా మారినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి బ్యాంకాక్ నుంచి ఏకంగా పది అనకొండలను చెక్‌ఇన్ బ్యాగ్‌లో ప్యాక్ చేసుకుని ఇండియాకు తీసుకవచ్చాడు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తి చెక్‌ఇన్ లాగేజ్ బ్యాగ్ చూసి షాక్ అయ్యారు. అరుదైన పది ఎల్లో అనకొండ పాము పిల్లల్ని అక్రమంగా బ్యాంకాక్ నుంచి తీసుకవస్తున్నాడని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బెంగళూరు కస్టమ్స్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరాలు వెల్లడించింది. "ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించబోము" అని డిపార్ట్‌మెంట్ పోస్ట్‌లో పేర్కొంది.

కాగా, గతంలో కూడా బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు కంగారూ పిల్లతో సహా 234 వన్యప్రాణులను బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రక్షించారు. ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న కంగారు పిల్ల ఊపిరాడక మృతి చెందింది. కాగా, పసుపు అనకొండ అనేది నీటి వనరులకు దగ్గరగా కనిపించే ఒక నది జాతి అని నిపుణులు చెబుతున్నారు. ఈ పసుపు అనకొండలు సాధారణంగా పరాగ్వే, బొలీవియా, బ్రెజిల్, ఈశాన్య అర్జెంటీనా, ఉత్తర ఉరుగ్వేలో కనిపిస్తాయి.



Next Story

Most Viewed