- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కోసం ఓట్లడుగుతున్న కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత : దీదీ
దిశ, నేషనల్ బ్యూరో : ‘టీఎంసీ కంటే బీజేపీకి ఓటు వేయడమే బెటర్’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ స్పందించారు. ‘‘అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతగా ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్న నాయకుడు బీజేపీకి ఓటేయమని ప్రజలను కోరుతున్నారు. దీన్నిబట్టి ఆయనకు సిద్ధాంతాలు, ఆదర్శాలు లేవని తేలిపోయింది. అధిర్ లాంటి కొందరు స్వార్థపరులే దేశాన్ని అమ్మేశారు’’ దీదీ వ్యాఖ్యానించారు. గురువారం క్రిష్ణానగర్ లోక్‌సభ స్థానంలో మహువా మొయిత్రాకు మద్దతుగా టీఎంసీ చీఫ్ ఎన్నికల ప్రచారం చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) దేశంలో అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులకు విఘాతం కలుగుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. వివిధ కమ్యూనిటీలు, తెగలు, వర్గాలు ఆచారాలు, సంప్రదాయాలను పాటించకుండా యూసీసీ నిరోధిస్తుందన్నారు.