బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మమతా బెనర్జీ

by Dishanational1 |
బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను బీజేపీ నేత సువేందు అధికారి ఆదేశానుసారం దాఖలు చేశారని ఆరోపించిన బిజెపి నాయకుడి వీడియోను టీఎంసీ పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సందేశ్‌ఖాలీ సంఘటనలు రాష్ట్రాన్ని కించపరిచే విధంగా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీఇట్ చేసిన దీదీ.. సందేశ్‌ఖాలీ సంఘటనలను వాడుకుని బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. నా తల్లులు, సోదరీమణుల భావోద్వేగాలను ఏమార్చేందుకు ప్రయత్నిచించిన బీజేపీ అసలు ముఖం బయటపడింది. మే 13న బంగ్లా విరోధులను బెంగాల్ నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు నిర్ధారించుకున్నారని తీవ్రంగా స్పందించారు. కాగా, అంతకుముందు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఒక వీడియో మెసేజ్‌లో ఈ సంఘటనకు సంబంధించి సువేందు అధికారి పాత్ర ఉందని ఆరోపించారు. కుట్రకు సూత్రధాని అతనేనని అన్నారు. సువేందు అధికారి నకిలీ ఫిర్యాదులు చేయడానికి సందేశ్‌ఖాలీ ప్రజలను ఏమార్చి భారీ కుట్రకు తెరతీశాడన్నారు. బెంగాల్ ప్రతిష్టను కించపరిచే అతని ప్రయత్నాలను ప్రజలు క్షమించరు' అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed