- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విపక్ష నేత హోదాలో మోడీ ప్రమాణస్వీకారానికి ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ నేతలకు ఆహ్వానాలు అందగా, ఇప్పటికే వారు దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆహ్వానం అందలేదని ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం నాడు ఖర్గేకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఆహ్వానం అందింది. అయితే తన హాజరును ధృవీకరించని ఖర్గే, ఇండియా కూటమి నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాత వేడుకకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. విపక్ష నేతగా ఉన్న ఖర్గే అదే హోదాలో వేడుకకు అటెండ్ కానున్నారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తెలిపారు. అంతకుముందు బీజేపీ విపక్షాలకు ఆహ్వానాలు పంపలేదని విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తమ పార్టీ నేతలకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు, ఈవెంట్‌కు అంతర్జాతీయ నాయకులను ఆహ్వానిస్తున్నారని, అయితే ఇండియా కూటమి నాయకులను మాత్రం ఆహ్వానించలేదని నొక్కి చెప్పారు