Maharashtra: వీవీ ప్యాట్ స్లిప్, ఈవీఎంల మధ్య ఎలాంటి తేడా లేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై ఈసీ క్లారిటీ

by vinod kumar |
Maharashtra: వీవీ ప్యాట్ స్లిప్, ఈవీఎంల మధ్య ఎలాంటి తేడా లేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై ఈసీ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పారదర్శకతపై అనుమానాలున్నాయని ప్రతి పక్ష మహా వికాస్ అఘాడీ(MVA) కూటమి నేతలు ఆరోపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ (Election commission) కీలక ప్రకటన చేసింది. వీవీ ప్యాట్ (VV PAT) స్లిప్‌లు, ఈవీఎంలలో పోలైన ఓట్లలో ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదని తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చొక్కలింగం (Chokkalingam) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సుప్రీంకోర్టు (Supreme Court), భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి సెగ్మెంట్‌లో 5 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో 1445 వీటీ ప్యాట్‌లను కౌంటింగ్ రోజే లెక్కించామని, ఈ ప్రక్రియలో అన్ని స్లిప్‌లు ఈవీఎం డేటాతో సరిపోలాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన ప్రతినిధులు, ఈసీ పరిశీలకుల సమక్షంలోనే వీటిని లెక్కించామని తెలిపారు. ఏ వీవీప్యాట్ స్లిప్, ఈవీఎం నంబర్‌కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ లెక్కింపు తర్వాతే ఎన్నికల ఫలితాలు వెల్లడించామని క్లారిటీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డు చేసి, ఫుటేజీని భద్రపరిచామని చెప్పారు.

కాగా, గత నెల 20 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అదే నెల 23న ఫలితాలు వెలువడ్డాయి. అధికార మహాయుతి కూటమి 235 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఇందులో బీజేపీ ఒంటరిగా 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఎంవీఏ కూటమి కేవలం 46 సీట్లలోనే గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని విపక్ష నేతలు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయని తెలిపారు. ఈసీకి పలు ఫిర్యాదులతో కూడిన లేఖను అందించారు. దీంతో తాజాగా ఈ అంశంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది.

Next Story

Most Viewed