Ajit Pawar : అజిత్ పవార్‌పై పోటీకి అనూహ్య అభ్యర్థి.. శరద్ పవార్ స్కెచ్

by Hajipasha |
Ajit Pawar : అజిత్ పవార్‌పై పోటీకి అనూహ్య అభ్యర్థి.. శరద్ పవార్ స్కెచ్
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన మేనల్లుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై పోటీకి అనూహ్య అభ్యర్థిని సిద్ధం చేశారు. తన పార్టీ (ఎన్‌సీపీ)ని చీల్చిన అజిత్‌‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు ఓ సమీప బంధువునే బారామతి స్థానంలో బరిలోకి దించనున్నారు. అది మరెవరో కాదు.. 32 ఏళ్ల యుగేంద్ర పవార్! ఈయన అజిత్‌ పవార్‌కు స్వయానా మేనల్లుడే. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ పవార్ కుమారుడే యుగేంద్ర పవార్. శరద్ పవార్ వర్గం ఎన్‌సీపీలో మొదటి నుంచీ యుగేంద్ర చురుగ్గా పని చేస్తున్నారు.

అయితే బారామతిలో యుగేంద్ర అభ్యర్థిత్వాన్ని శరద్ పవార్ ఎన్‌సీపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. యుగేంద్ర పవార్ అమెరికాలో బీబీఏ చేశారు. శరద్ పవార్‌కు చెందిన విద్యా ప్రతిష్ఠాన్‌కు కోశాధికారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తలపడ్డారు. అయితే విజయం మాత్రం సుప్రియా సూలేను వరించింది. సుప్రియ తరఫున ఎన్నికల ప్రచారంలో యుగేంద్ర చాలా కీలకంగా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed