- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తప్పుడు హామీతో వివాహిత శారీరిక సంబంధం.. తర్వాత ఏమైందంటే!

- వివాహానికి నిరాకరించిన వ్యక్తి
- అత్యాచారం కేసు పెట్టిన మహిళ
- కేసు కొట్టేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: వివాహం చేసుకుంటాననే తప్పుడు హామీతో ఒక వ్యక్తితో శారీరిక సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత హామీని నెరవేర్చలేదంటూ వివాహత పెట్టిన రేప్ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. వివాహం చేసుకుంటానని సదరు వ్యక్తి తనకు తప్పుడు హామీ ఇచ్చాడని.. అందుకే తనతో శారీరిక సంబంధం పెట్టుకున్నానని వివాహిత చెప్పింది. అయితే ఆ వ్యక్తి వివాహం విషయంలో మోసం చేయడంతో రేప్ కేసు పెట్టింది. కాగా, పెళ్లి చేసుకుంటానన్న హామీతోనే శారీరిక సంబంధానికి సమ్మతించానని వివాహిత చెప్పుకోవడానికి వీల్లేదని మధ్య ప్రదేశ్ హైకోర్టు కేసు కొట్టేసింది.
కేసు పెట్టిన మహిళ, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందిన వారు. వీరి మధ్య పరిచయం శారీరిక సంబంధానికి దారి తీసింది. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని శారీరిక సంబంధానికి ముందు నిందితుడు చెప్పాడు. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ సదరు వివాహిత ఒత్తిడి తెచ్చింది. కానీ తన భార్యకు విడాకులు ఇచ్చి, నిన్న పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తనకు తప్పుడు హామీలు ఇచ్చి శారీరికంగా లోబరుచుకున్నాడంటూ సదరు మహిళ ఆ వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. దీంతో నిందితుడు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ మణిందర్ ఎస్ భట్టీ ఈ కేసును విచారించారు.
కాగా, సదరు మహిళను బలవంతంగా ఒత్తిడి చేసి శారీరిక సంబంధం పెట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్‌లో ఎలాంటి వివరాలు లేవు. సదరు మహిళ కూడా తప్పుడు వాగ్దానాన్ని సాకుగా చూపి రేప్ కేసు పెట్టకూడదు. ఇలాంటి కేసులను ఎఫ్ఐఆర్ దశలోనే బ్రేక్ చేయాలని జస్టిస్ మణిందర్ ఎస్ భట్టీ చెప్పారు. ఈ కేసును కొట్టేస్తూ ఆయన తీర్పు చెప్పారు.