- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాముడు విధుల నుంచి ఎన్నడూ తప్పుకోలేదు: ప్రధాని
అయోధ్య: శ్రీరామచంద్రుని జీవితం నుంచి మనం నేర్చుకోదగిన ఆదర్శాలను మరోసారి మననం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం అయోధ్యలో జరిగిన వార్షిక దీపోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఆయన దేశ ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తున్న సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ (సకలజనుల అభివృద్ధి) అనే లక్ష్యానికి శ్రీరాముడి ఆదర్శాలే ప్రేరణ అని చెప్పారు. 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాని అయోధ్యను సందర్శించడం ఇదే తొలిసారి. అయోధ్యలో వరుసగా ఆరో సంవత్సరం జరిపిన దీపోత్సవ్ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శ్రీరాముడు తన విధుల నుంచి ఎన్నడూ వెనక్కి తగ్గలేదన్నారు. రాముడిని మర్యాదా పురుషోత్తముడు అని పిలుస్తారు. మర్యాద అంటే మనం ఇతరులను గౌరవించడం అని, వారి నుంచి గౌరవాన్ని తిరిగి పొందడం అని ప్రధాని వివరించారు.
75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దీపావళి వచ్చింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాలను మనం జరుపుకుంటున్నందున శ్రీరాముడి కృతనిశ్చయం వంటిది దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న బ్రిటిష్ కాలం నాటి రాజ్‌పథ్ పేరును తమ ప్రభుత్వం మార్చేయడానికి శ్రీరాముడు ప్రేరణ అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అనే తమ ప్రభుత్వ లక్ష్యం వెనుక శ్రీరాముడే ప్రేరణగా నిలిచాడు. రాముడు ప్రతి ఒక్కరినీ తనతోపాటు తీసుకెళ్లాడు, ఏ ఒక్కరినీ వదిలివెళ్లలేదు. కర్తవ్యమే బలం అనే రాముడి బోధనలు ఆదర్శంగా తమ ప్రభుత్వం కర్తవ్య పథ్‌ని ఎంచుకుందని మోడీ చెప్పారు.
విశ్వవ్యాప్తంగా మన అస్తిత్వాన్ని నెలకొల్పడానికి శ్రీరాముడి పాలనే ఆదర్శంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవాన్ని నేడు ప్రపంచమంతా చూస్తోందని, రామాలయ ఉద్యమం మొదలైన కాలం నుంచి అభివృద్ధి కనిపించని అయోధ్యలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ది పథకాలపై దృష్టి సారించిందని తెలిపారు. మొదటగా సరయూ నదీ తీరంలో ప్రధాని హారతి సమర్పించారు. ఆ తర్వాతే అయోధ్యలో దీపోత్సవాలు ప్రారంభమయ్యాయి. 20 వేల మంది వాలంటీర్లు దాదాపు 15 లక్షల దీపాలను సరయూ నదీ తీరంలో వెలిగిస్తూ హారతి పట్టారు.