నన్ను పదేళ్లు జైల్లో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్

by Harish |
నన్ను పదేళ్లు జైల్లో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్
X

లాహోర్: దేశద్రోహం కేసులు బనాయించి తనను పదేళ్ల పాటు జైల్లో వేసేందుకు పాక్ ఆర్మీ కుట్ర పన్నిందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఎట్టకేలకు వాళ్ళు వేసిన లండన్ ప్లాన్ బయటికొచ్చిందని కామెంట్ చేశారు. ఆయన లాహోర్ లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. " నేను జైలులో ఉన్నప్పుడు హింస జరుగుతుందనే అనవసర వదంతులను వ్యాపింపజేశారు. నా కేసులో ఆదేశాలు ఇచ్చిన జడ్జిల పైనా నిరాధార ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ పై జులుం చేయడం వాళ్లకు అలవాటుగా మారింది. ఇక నా భార్య బుష్రా ను అరెస్ట్ చేయడం ద్వారా నన్ను కించపర్చాలని భావిస్తున్నారు" అని ఇమ్రాన్ పేర్కొన్నారు.


"పాక్ ప్రభుత్వం మీడియాను కంట్రోల్ లో పెట్టుకుంది. నన్ను అరెస్టు చేశాక రోడ్లపైకి వచ్చిన వాళ్ళను భయకంపితులను చేసింది. మరోసారి నన్ను అరెస్ట్ చేసినప్పుడు.. జనం ఎవ్వరూ రాకూడదు అనేలా వాళ్ళు వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా.. నేను అల్లా ఎదుట తప్ప ఎక్కడా తలవంచను. నా చివరి రక్తపు బొట్టు వరకు నిజమైన స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంటాను. మీరు కూడా భయానికి గులాం కాకండి" అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed