- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Om Birla : గొప్ప సాహిత్య చరిత్ర కలిగిన భాష.. తెలుగులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిందన్నారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ సైతం తెలుగులో శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖ తెలుగు కవి, రచయిత, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ రోజు జరుపుకుంటున్న "తెలుగు భాషా దినోత్సవం" సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సాహిత్యాన్ని అర్థవంతంగా, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో రామమూర్తి విశేషమైన పాత్ర పోషించారన్నారు. ప్రాచ్య, సాంప్రదాయ భాషగా గొప్ప సాహిత్య చరిత్ర కలిగిన తెలుగు భాష మన అమూల్యమైన వారసత్వమన్నారు.