- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయ్.. రాహుల్ గాంధీ జోస్యం !
దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టైట్ ఫైట్ ఉండబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మీడియా అంచనాలకు, ఒపీనియన్ పోల్స్‌కు భిన్నంగా ఫలితం రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీకి 160 నుంచి 180 లోక్‌సభ సీట్లు రావడం కూడా అతికష్టమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఈనాడు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి.. గతంలో ఎన్నడూ అవి ఇలాంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘బీజేపీపై సైద్ధాంతిక పోరాటం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల ఫలితాలు వచ్చాక డిసైడ్ అవుతుంది’’ అని రాహుల్ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించుకొని ప్రధాని మోడీ దేశంలో రాజకీయ, ఆర్థిక గుత్తాధిపత్యాన్ని సంపాదించుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని భావిస్తున్న మోడీ టీమ్‌కు రాజ్యాంగాన్ని కాపాడాలని భావిస్తున్న ఇండియా టీమ్ మధ్య ఈ ఎన్నికల పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో గెలిచిన తర్వాత విపక్షాలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు.