- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. 5 న్యాయ్'లతో 25 హామీలు
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి. మంగళవారం ప్రధాన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆమోదించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 5 న్యాయ అంశాలతో మేనిఫెస్టోను ఖరారు చేసింది. దీనికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ వాగ్దానాలను దేశంవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ హామీలను వెల్లడించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో 25 హామీలతో కూడిన 5 'న్యాయ్'లపై దృష్టి పెట్టింది. అవేంటంటే.
హిస్సేదారి న్యాయ్:
* సామాజిక, ఆర్థిక కుల గణన
* ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్‌ల కల్పనపై 50 శాతం పరిమితి తొలగింపు
* ఎస్సీ ఎస్తీ సబ్ ప్లాన్ కోసం ప్రత్యేక బడ్జెట్
* అటవీ హక్కుల చట్టం క్లెయిమ్‌లను ఏడాదిలోగా పరిష్కరించే హామీ
* గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాగా గుర్తింపు
కిసాన్ న్యాయ్:
ఈ హామీ కింద రైతులను ఆదుకునే లక్ష్యంతో కాంగ్రెస్ సమగ్ర ప్యాకేజీని ప్రకటించింది.
* స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం
* రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
* పంట నష్టానికి 30 రోజుల్లో బీమా పరిహారం ఇచ్చే గ్యారెంటీ
* రైతుల లబ్దికి ఎగుమతి-దిగుమతి విధానం
* వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
శ్రామిక్ న్యాయ్ :
* రైట్-టూ-హెల్త్ చట్టం
* ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న కార్మికులందరినీ కలుపుకొని రోజుకు రూ. 400 కనీస వేతనం
* పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
* అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కవరేజీ
* ప్రభుత్వంలోని కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను నిలిపేయడం
యువ న్యాయ్:
* కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ
* యువతకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్
* పేపర్ లీక్‌ను అరికట్టడానికి కఠినమైన చట్టం
* గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
* రూ. 5,000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటుకు హామీ
నారీ న్యాయ్:
* ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి రూ. 1 లక్ష హామీ
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
* ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడం కోసం రెట్టింపు జీతం
* మహిళల హక్కుల రక్షణకు అధికారి మైత్రీ ఏర్పాటు
* వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలె పేరుతో రెట్టింపు హాస్టల్స్