- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
live-in couples: లివ్ ఇన్ రిలేషన్ షిప్.. ఉత్తరాఖండ్ యూసీసీలోని కీలక రూల్స్ ఇవే?

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ (Ucc) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులోని నిబంధనలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ (Live in Relationship) పై ప్రభుత్వం రూపొందించిన రూల్స్ బయటకు వచ్చాయి. యూసీసీ పోర్టల్‌లోని మూడో భాగంలో వీటిని పొందుపర్చారు. దీని ప్రకారం.. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 15 రకాల డాక్యుమెంట్స్ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ, నివాసం, అద్దెకు సంబంధించిన పత్రాలు లాంటివి ఉన్నాయి. అంతేగాక రిజిస్ట్రేషన్ కోసం 16 పేజీల ఫారమ్ నింపాలి. పూజారి నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవడంతో పాటు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అంతకుముందున్న సంబంధాల గురించి సైతం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే భర్త లేదా భార్య మరణించిన వారు, వారి మునుపటి లివ్-ఇన్ రిలేషన్ షిప్ ముగిసిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో దీనికి సంబంధించిన పత్రాలను అందించాలి.
లివ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం నమోదు చేసుకోకపోతే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. దరఖాస్తు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్‌లో చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకునే వారు తమ ఆధార్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. భాగస్వాములు 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, వారి తల్లిదండ్రుల పర్మిషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. అయితే ఒక జంట నెల రోజుల కంటే ఎక్కువ కాలం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి, రిజిస్ట్రార్‌కు తెలియజేయకపోతే అప్పుడు మేజిస్ట్రేట్ వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా చెల్లించే చాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లను రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఒక స్త్రీ తన భాగస్వామిని విడిచిపెట్టినట్లయితే ఆమె భరణం కోరే అవకాశం ఉంటుంది. వివాహం విషయంలో ఒకరికి అర్హత ఉన్నట్టే లివ్-ఇన్ రిలేషన్ షిప్ నుంచి పుట్టిన బిడ్డను కూడా చట్టబద్ధమైనదిగా గుర్తిస్తారు. ఆ తర్వాత పరస్పరం అంగీకారం కుదిరితే వివాహం సైతం చేసుకోవచ్చు.