Liquor scam: ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసు.. మాజీ ఎక్సైజ్ మంత్రి కావాసి లక్ష్మా అరెస్ట్

by vinod kumar |
Liquor scam: ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసు.. మాజీ ఎక్సైజ్ మంత్రి కావాసి లక్ష్మా అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశమైన లిక్కర్ స్కామ్ (Liquor scam) కేసులో రాష్ట్ర మాజీ ఎక్సైజ్ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కవాసీ లఖ్మాను (kawasa lakhma) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ఈడీ బుధవారం లఖ్మాను మూడోసారి విచారణకు పిలిచింది. ఇన్వెస్టిగేషన్ అనంతరం అదుపులోకి తీసుకుంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపర్చగా ఈ నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టుకు హాజరయ్యే క్రమంలో లఖ్మా మీడియాతో మాట్లాడారు. ‘దాడుల సమయంలో మా ప్రాంగణాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదు. అలాగే ఎలాంటి పత్రాలు సైతం అధికారులు స్వాధీనం చేసుకోలేదు. నన్ను తప్పుడు కేసులో జైలుకు పంపుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం విష్ణుదేవ్ సాయిలు ఆదివాసీల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతంలో గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు తనను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లఖ్మా అరెస్టుపై మాజీ సీఎం భూపేశ్ బఘేల్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈడీ పని చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంతోనే లఖ్మాను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed