Liquor policy case: నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్న సీఎం కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

by Shiva |
Liquor policy case: నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్న సీఎం కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టబోతున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ నెల 22 అరెస్ట్ చేసిన ఈడీ.. 23న కోర్టులో హాజరు పర్చింది. రౌస్ ఎవెన్యూ కేజ్రీవాల్‌ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని, కస్టడీ విధించకుండా తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరగా.. కోర్టు నిరాకరించింది. బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed