Lightning strikes: ఒడిశాలో పిడుగుపాటుల భీభత్సం.. 9 మంది మృతి

by vinod kumar |
Lightning strikes: ఒడిశాలో పిడుగుపాటుల భీభత్సం.. 9 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో పిడుగుపాటులు భీభత్సం సృష్టించాయి. శనివారం అర్దరాత్రి వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా తొమ్మిది మంది మృతి చెందగా..మరో 20 మందికి పైగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మయూర్ భంజ్‌లో ఇద్దరు, భద్రక్‌లో ఇద్దరు, డెంకనల్, జాజ్‌పూర్, కేంద్రపారా, కటక్, గంజాం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. భద్రక్ జిల్లాలో ఇద్దరు రైతులు పొలంలో పని చేస్తుండగానే పిడుగుపాటుతో మరణించారు. అలాగే గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనలపై సీఎం మోహన్ చరణ్ మాఝీ స్పందించారు. 9 మంది మరణించడం పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, రుతుపవనాల కాలంలో మెరుపు దాడుల వల్ల దేశంలో అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. రాష్ట్రంలో గత ఐదేళ్లలో పిడుగుపాటు కారణంగా 1472 మంది మరణించడం గమనార్హం.

Advertisement

Next Story