Life Insurance Premium: జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలి.. ఆల్ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ డిమాండ్..!

by Maddikunta Saikiran |
Life Insurance Premium: జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలి.. ఆల్ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ డిమాండ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాలసీదారులు చెల్లించే జీవిత బీమా ప్రీమియం(Life Insurance Premium)లపై జీఎస్టీ(GST) నుంచి మినహాయించాలని ఆల్ ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌(AILEF) డిమాండ్‌ చేస్తోంది. అలాగే బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(FDI) పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయనున్నట్లు ప్రకటించింది. బీమా రంగంలో ఇదివరకే ఎఫ్‌డీఐల పరిమితి 74 శాతంగా ఉందని, దాన్ని 100 శాతానికి పెంచితే విదేశీ కంపెనీలు(Foreign Companies) ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశాలున్నాయని ఏఐఎన్‌లైఫ్‌ జనరల్‌ సెక్రటరీ(GS) వీ.నరసింహన్‌(V. Narasimhan) ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్లను పార్లమెంట్(Parliament)లో లేవనెత్తేలా అన్ని రాజకీయ పార్టీల ఎంపీల(MPs)తో త్వరలో సమావేశం అవుతామని పేర్కొన్నారు. అలాగే న్యూ లేబర్ యాక్ట్(New Labor Act) కోడ్‌ను ఉపసంహరించుకోవాలని, ఓల్డ్ పెన్షన్ స్కీం(OPS)ను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed