Parliament session: రైతులను మోడీ సర్కార్ అవమానించింది

by Shamantha N |
Parliament session: రైతులను మోడీ సర్కార్ అవమానించింది
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో కనీస మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రశ్నపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. " ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువస్తుందా లేదా అని సూటి ప్రశ్న అడిగారు? జూలై 2022 నుండి MSP చట్టాన్ని తీసుకురావడానికి ప్రధాని మోడీ మోడీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఉందా? 2024 చట్టం చేయడానికి వస్తుందా లేదా?” అని సూర్జేవాలా ప్రశ్నించారు. కేంద్రమంత్రి దీనిపై సమాధానం చెప్పేందుకు తిరస్కరించారు. కాగా.. మోడీ ప్రభుత్వం, వ్యవసాయశాఖ మంత్రి పార్లమెంటు వేదికగా 72 కోట్ల మంది రైతులను, కార్మికులను అవమానించారని పేర్కొన్నారు.

కేంద్రవ్యవసాయశాఖ మంత్రి ఏమన్నారంటే?

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. "2004-14 మధ్య 6,29,000 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు మాత్రమే కొనుగోలు చేశామని తెలిపారు. మోడీ సర్కారు కోటి 70 లక్షల పప్పు ధాన్యాలు కొనసుగోలు చేసిందన్నారు. అంటే 25 రేట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని రైతులను కోరుతున్నా. రైతులు పండించిన ప్రతిధాన్యాన్ని కొనుగోలు చేస్తాం” అని తెలిపారు.



Next Story