‘క్రిమినల్ పరువు నష్టం’ను నేరంగానే కొనసాగించాలి : లా కమిషన్

by Hajipasha |
‘క్రిమినల్ పరువు నష్టం’ను నేరంగానే కొనసాగించాలి : లా కమిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : క్రిమినల్ పరువు నష్టం కేసులకు సంబంధించి లా కమిషన్ కీలక సిఫారసు చేసింది. నేరపూరిత పరువునష్టాన్ని క్రిమినల్ నేరంగా క్రిమినల్ చట్టాలలో ఉంచే విషయాన్ని పరిగణించాలని పేర్కొంది. క్రిమినల్ పరువు నష్టం చట్టంపై అధ్యయన నివేదికను లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం.. ఖ్యాతి పొందే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తోంది. ‘‘జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కోణం నుంచి చూస్తే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, ఆరోపణల నుంచి తప్పకుండా పౌరులకు తగినంత రక్షణ పొందే హక్కు ఉంటుంది’’ అని లా కమిషన్ అభిప్రాయపడింది. ‘‘పరువు ప్రతిష్ఠలు అనేవి చూడలేనివి. జీవితమంతా కష్టపడి వీటిని సంపాదిస్తారు. కొందరి వ్యాఖ్యల వల్ల కొన్ని సెకన్లలోనే ఇవి నాశనం అవుతాయి. ఒకరి ప్రతిష్టను, దానితో ముడిపడిన అంశాలను రక్షించడం అత్యవసరం’’ అని పేర్కొంది. ఇక మరో అంశంలో.. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వ్యక్తులు తమ వల్ల కలిగే నష్టానికి సమానమైన మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే బెయిల్ పొందాలని లా కమిషన్ సిఫారసు చేసే ఛాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed