జాతీయ పార్టీ హోదా కోల్పోనున్న ఎన్సీపీ!

by S Gopi |
జాతీయ పార్టీ హోదా కోల్పోనున్న ఎన్సీపీ!
X

న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ పార్టీ హోదా కోల్పోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఎలక్షన్ కమిషన్ సమీక్షించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్సీపీ, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీల జాతీయ హోదా అంశం ఈసీ సమీక్షకు వచ్చింది. కానీ వరుస అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి దీనిపై చర్చించనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈసీ దీనిపై సమీక్షిస్తే దాదాపుగా ఎన్సీపీ జాతీయ హోదా రద్దయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఒక పార్టీ జాతీయ హోదా పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి, లోక్ సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు వచ్చి ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవాలి, అంతేగాక మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో కనీసం 2 శాతం సీట్లు గెలిచినా జాతీయ పార్టీకి అర్హత సాధిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed