- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Lahore: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా పాకిస్థాన్ లోని లాహోర్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా పాకిస్థాన్ లోని లాహోర్ నిలిచింది. గతంలో మాదిరిగానే కాలుష్యనగరంగా తన స్థానాన్ని నిలుపుకుంది. లాహోర్ సిటీ ఏక్యూఐ (Air Quality Index) 708కి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చితే లాహోర్ గాలి నాణ్యత 86.2 రెట్లు దారుణంగా ఉందని నివేదికలో వెల్లడైంది. దీంతో, పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాహోర్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులకు అత్యవసర సందేశం జారీ చేసింది. పౌరులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తమ ఇళ్లలోని కిటికీలను, ఇంటి తలుపులను మూసివేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అంతేకాదు, పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేశారు. విద్యాసంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
తీవ్ర వాయు కాలుష్యం
ఈ సంక్షోభం పంట తగులబెట్టడం, అనియంత్రిత వాహన ఉద్గారాలు, కాలం చెల్లిన పారిశ్రామిక పద్ధతులు, అసమర్థమైన పర్యవేక్షణ వల్ల ఏర్పడినట్లు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. లాహోర్‌లోని ప్రైవేట్ ఎయిర్ క్వాలిటీ మానిటర్‌లు గుల్బర్గ్‌లో 953, పాకిస్తాన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ దగ్గర 810,సయ్యద్ మరాతాబ్ అలీ రోడ్‌లో 784 ఏఐక్యూ రీడింగ్‌లను నమోదు చేశాయి. అయితే, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ కల్చర్ చేంజ్ డిపార్ట్‌మెంట్ (EPCCD) కార్యదర్శి ఈ రీడింగ్‌లను తోసిపుచ్చారు. ప్రభుత్వ మానిటర్లు తక్కువ-ధర సెన్సార్‌లను ఉపయోగిస్తాయని, ఇంకా, ప్రైవేట్ డేటాను విశ్వసనీయంగా పరిగణించమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, లాహోర్ కేవలం మూడు ఫంక్షనల్ ఎయిర్ క్వాలిటీ మానిటర్‌లపై ఆధారపడి ఉంది. నవంబర్‌లో ఎనిమిది అదనపు యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఎయిర్ మానిటర్‌లను ఏర్పాటుచేయడం ద్వారా రిపోర్టింగ్‌ను మెరుగుపరచడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. లాహోర్ లో వాయు కాలుష్యానికి కారణం ఢిల్లీ, అమృత్ సర్, చండీగఢ్ నుంచి వస్తున్న పొగ, ధూళి అని ఆరోపించారు.