కర్ణాటకలో నీటి కొరత.. బెంగుళూరు నుంచి వైజాగ్‌కు ఆర్సీబీ మ్యాచ్ తరలింపు..!

by Mahesh |
కర్ణాటకలో నీటి కొరత.. బెంగుళూరు నుంచి వైజాగ్‌కు ఆర్సీబీ మ్యాచ్ తరలింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి ప్రారంభం కాకముందే కర్ణాటక రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాలు, నగరాల్లో నీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. గత రెండు వారాలుగా బెంగళూరు నగరంలో ఈ సమస్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు నీటి ట్యాంకర్లలో ప్రజలకు నీరు అందిస్తున్నారు. అయినప్పటికి సమస్య తీరకపోవడంతో పలు కీలక కంపెనీలు తమ వర్క్ ను ఆపేసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యంత ప్రజా ఆదరణ పొందిన ఐపీఎల్ 2024 సీజన్ 17 మార్చి 22 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ కోసం వేచి చూస్తున్నారు. ఈ సారైన ఆర్సీబీ కప్ కొడుతుందనే నమ్మకంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆత్రుతగా వేచి ఉన్నారు. కానీ వారిక ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తమ అభిమాన క్రికెటర్ ను చూడోచ్చనుకే వారికి నీటి సమస్య భారీ షాక్ తగిలేల ఉంది.

ఇప్పటికే బెంగుళురు ప్రజలు నీరు లేక టాయిలెట్ కోసం మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని.. ఇక్కడ జరిగే మ్యాచులు పూణే, విశాఖపట్నం స్టేడియాలకు షిఫ్ట్ అయ్యాయని వార్తలొస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ నడుస్తుంది. కాగా కర్ణాటక క్రికెట్ బోర్డు మాత్రం ఈ వార్తలను ఖండించింది.

Advertisement

Next Story

Most Viewed