Kolkata rape case: కోల్‌కతా లైంగిక దాడి ఘటన.. ఎయిమ్స్ సహాయం తీసుకోనున్న సీబీఐ!

by vinod kumar |
Kolkata rape case: కోల్‌కతా లైంగిక దాడి ఘటన.. ఎయిమ్స్ సహాయం తీసుకోనున్న సీబీఐ!
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనలో ఒక్కరి కంటే ఎక్కువ మంది నిందితుల ప్రమేయం ఉందని ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదికలపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్ల సహాయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సంజయ్ రాయ్ మాత్రమే నేరానికి పాల్పడ్డాడా లేదా ఇతరుల ప్రమేయం కూడా ఉందా అని నిర్ధారించడానికి ఈ నివేదికలు సీబీఐకి సహాయపడతాయని పలువురు భావిస్తున్నారు.

అయితే లైంగిక దాడి ఘటనకు పాల్పడింది కేవలం సంజయ్ మాత్రమేనని సీబీఐ నిర్థారించింది. ఇతర వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు సూచించడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సైతం లేకపోవడం గమనార్హం. దీంతో నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే ఇతరుల ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించనున్నారు. కోల్‌కతా పోలీసుల నుంచి అన్ని ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కాగా, తమ కూతురిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story