- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Kolkata Murder Probe : జూనియర్ వైద్యురాలి కేసులో కీలక మలుపు.. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ శనివారం సాయంత్రం కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్‌లను అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది. వాస్తవానికి ఇటీవలే ఓసారి సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలను అప్పట్లో నమోదు చేసింది. ఈనెల 23వ తేదీ వరకు సందీప్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించింది.
కేసు విచారణపై నివేదికను ఈనెల 17లోగా సమర్పించమని సీబీఐని గత నెలలో కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ సమీపించిన వేళ జూనియర్ వైద్యురాలి కేసుతో ముడిపడిన అభియోగాలను కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై నమోదు చేయడం గమనార్హం. కాలేజీలోని సెమినార్ హాలుపై జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. అయితే ఈ దురాగతం చోటుచేసుకున్న మరుసటి రోజునే సెమినార్ హాలులో మరమ్మతు పనులు చేయాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వ ప్రజా పనుల విభాగానికి ఆనాడు కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ లేఖ రాశారు. దాని ఆధారంగానే ఆయనపై సాక్ష్యాల మాయం అభియోగం మోపినట్లు తెలుస్తోంది.