- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brinda Karat : మమతాబెనర్జీ సర్కారు విశ్వసనీయత సున్నా : బృందాకారత్
దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకారత్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీఎంసీ సర్కారు విశ్వసనీయత సున్నాకు పడిపోయిందని ఆమె విమర్శించారు. కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం మమత యత్నిస్తున్నారని బృందాకారత్ ఆరోపించారు. సోమవారం ప్రముఖ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. టీఎంసీ ఎంపీలంతా ఈ కేసుకు సంబంధించి తప్పుడు వ్యాఖ్యలే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ టీఎంసీ ఎంపీలు డాక్టర్లే అయి ఉంటే.. ఈ కేసు గురించి అంత బాధ్యతారహితంగా మాట్లాడి ఉండే వాళ్లే కాదన్నారు. జూనియర్ వైద్యురాలి కేసుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌కు పోలీసులు సమన్లు జారీ చేసిన విషయాన్ని బృందాకారత్ గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ కలిసి మమతా బెనర్జీ సర్కారు ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిందని వ్యాఖ్యానించారు.