Kharge: అంబేద్కర్ ను తుంగలో తొక్కాలని చూస్తున్నారు.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Kharge: అంబేద్కర్ ను తుంగలో తొక్కాలని చూస్తున్నారు.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వం(BJP Government) బాబా సాహెబ్ అంబేద్కర్(Br. Ambedkar) ను తుంగలో తొక్కాలని చూస్తున్నదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjuna Kharge) అన్నారు. పంజాబ్‌లో(Panjab) అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. డా. బీఆర్‌ అంబేద్కర్ ని అగౌరవపరచడం దారుణమని, మన రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ వేత్త అయిన అంబేద్కర్ ని ప్రస్తుత పాలనలో తుంగలో తొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన ప్రస్తుత పాలనలో సమానత్వం, సామాజిక సమ్మేళనం వంటి వాగ్దానాలు ఎంత బూటకంగా ఉన్నాయో స్పష్టంగా గుర్తు చేస్తుందని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం అంబేద్కర్ పేరును, ఫోటోను తన రాజకీయాల కోసం, ఓట్లు కోసం మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.

అంబేద్కర్ విలువలు, దృక్పథాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, దళితుల ఐకాన్ గా ఉన్న అంబేద్కర్ విగ్రహాలను రాజకీయాల కోసం వాడుకొని, వాటిని పరిరక్షించడంలో ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు. అంతకు ముందు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి జరిగినది దిగ్భ్రాంతి కలిగించిదని, దానిని యథాతథంగా పునరుద్దరించాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవించడం పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ జాతికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని, ప్రతి పౌరునికి సమానత్వానికి హామీ ఇచ్చే రాజ్యాంగాన్ని రూపొందించడం, సమ్మిళిత భారతదేశం కోసం అతని దృష్టి అత్యున్నత గౌరవం కంటే తక్కువ ఏమీ కాదని స్పష్టం చేశారు.

అలాగే పవిత్ర నగరమైన అమృత్‌సర్‌లోని అంబేద్కర్ విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు, పంజాబ్ ప్రభుత్వం తక్షణమే మరియు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఈ చర్యకు పాల్పడిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం రెండూ ఇలాంటి విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నాయని దేశం భావించవలసి వస్తుందని తెలిపారు. ఇక అంబేద్కర్ వారసత్వాన్ని పరిరక్షించడానికి, నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఆయన రచనలు, మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలను అణగదొక్కే ప్రయత్నానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన జ్ఞాపకం, సందేశం శాశ్వతంగా.. క్షీణించకుండా ఉండేలా చూసుకోవడం మన సమిష్టి కర్తవ్యమని ఖర్గే అన్నారు.



Next Story

Most Viewed