Khalistani terrorist: అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు

by Shamantha N |
Khalistani terrorist: అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది(Khalistani terrorist) గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్యలోని రామ మందిరం (Ram Mandir) సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తానని హెచ్చరించాడు. నవంబర్‌ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామని హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం’ అంటూ పన్నూ హెచ్చరించాడు. అందులో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. మరోవైపు, హిందూ దేవాలయాలపై ఖలిస్థానీలు చేస్తున్న దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను కూడా పన్నూ హెచ్చరించాడు.

గతంలోనూ బెదిరింపులు..

కాగా, పన్నూ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి హెచ్చరికలే చేశారు. నవంబర్‌ 1 నుంచి 19 వరకు ఎయిర్‌ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించొద్దంటూ గత నెలలో వార్నింగ్‌ ఇచ్చాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. గతేడాది కూడా నవంబర్‌ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. ఇప్పుడేమో రామ మందిరం పునాదుల్ని పెకిలిస్తాం అని వార్నింగ్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed