- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూజీసీ కీలక నిర్ణయం: ఆ టైంలో చేనేత వస్త్రాలనే ధరించాలని సూచన

దిశ, నేషనల్ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వార్షికోత్సవం, కాన్వకేషన్, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా చేనేత వస్త్రాలనే ధరించే విషయాన్ని పరిగణించాలని యూనివర్సిటీలకు సూచించింది. దీనికి సంబంధించి 2015, 2019లో అన్ని విశ్వవిద్యాలయాలకు ఆర్డర్స్ జారీ చేసింది. ‘యూజీసీ సూచనను స్వీకరించి, చాలా విశ్వవిద్యాలయాలు తమ స్నాతకోత్సవాల సందర్భంగా ఇప్పటికే చేనేత వస్త్రాలను ధరిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు ఇంకా తమ డ్రెస్ కోడ్‌ను మార్చలేదని యూజీసీ గుర్తించింది’ అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు. అందుకే ఈ విషయంపై మరోసారి విశ్వవిద్యాలయాలకు సూచనలు పంపినట్టు వెల్లడించారు. చేనేత వస్త్రాల వాడకం వల్ల భారయుడిగా గర్వించడమే గాక, దేశంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించేలా ఉంటుందని చెప్పారు. ఇది చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.