- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళ సీఎం ఏదో దాస్తున్నారు! జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో.. కేరళ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆదివారం కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ.. " జస్టిస్ హేమ కమిటీ నివేదికపై.. కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. దీనిలో సీపీఐ నేత ప్రమేయం ఉన్నందువల్లే, కేరళ సీఎం ఈ విషయంలో నోరు మెదపడం లేదని, మొత్తానికి పినరయి విజయన్ ఏదో దాస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని హేమ కమిటీ సుస్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై, విచారణ చేపట్టిన హేమ కమిటీ పలు విషయాలను బయటపెట్టింది" అని జేపీ నడ్డా అన్నారు.
కాగా, ఆగస్టు 19 న హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత.. చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళీ సినీ ప్రముఖులపై ఇప్పటివరకూ కనీసం 10 కేసులు నమోదయ్యాయి.