CAA ను మా రాష్ట్రంలో అమలు చేయం: ముఖ్యమంత్రి

by GSrikanth |
CAA ను మా రాష్ట్రంలో అమలు చేయం: ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA)ను అమలులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిజమయ్యాయి.

అయితే, ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా.. ఈ చట్టంలో ముస్లింలకు మినహాయింపు ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా.. ఈ చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. CAA చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోము అని తేల్చి చెప్పారు. దీనిని మత విభజన చట్టంగా అభివర్ణించిన విజయన్.. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో అమలు కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed