Kerala Assembly: కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం..

by Vinod kumar |
Kerala Assembly: కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం..
X

తిరువనంతపురం: ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం తీసుకొచ్చేందుకు చేస్తున్న చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూసీసీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. దేశంలో యూసీసీ అమలు చేయాలనుకోవడం ఏకపక్షమని, ఇది తొందరపాటు చర్య అని కేంద్రాన్ని విమర్శించారు.

సంఘ్ పరివార్ సిఫార్సు చేసిన యూసీసీ రాజ్యాంగం ప్రకారం లేదని, ‘మనుస్మృతి’పై ఆధారపడి ఉందని ఆరోపించారు. ఈ తీర్మానానికి సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమితోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ సైతం మద్దతు ప్రకటించడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం అసెంబ్లీ సైతం యూసీసీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed