రేపే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

by Y. Venkata Narasimha Reddy |
రేపే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
X

దిశ వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై జైలు నుంచి విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానన్న ప్రకటన మేరకు రేపు రాజీనామాకు సిద్దమయ్యారు. మంగళవారం డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కోరారని ఆప్ వెల్లడించింది. రేపు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ ను కలుస్తారని, ఈ సందర్భంగా సీఎం పదవికి తన రాజీనామా సమర్పించవచ్చని ఆప్ పేర్కొంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో తనను, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను బీజేపీ అక్రమ కేసులతో జైలులో నిర్భంధించిందని తాజాగా ఆరోపించారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని ప్రకటించారు. ప్రజలు తనతోపాటు సిసోడియా విశ్వసనీయతకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే పదవుల్లోకి వస్తామని ప్రకటించారు. మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో తదుపరి సీఎం ఎంపిక అంశంపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల వరకూ పార్టీ నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed