లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవనున్న కేజ్రీవాల్.. రాజీనామా ఇచ్చేందుకే..!

by karthikeya |   ( Updated:2024-09-17 06:51:48.0  )
లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవనున్న కేజ్రీవాల్.. రాజీనామా ఇచ్చేందుకే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేడు (మంగళవారం) సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాను ఆయన సాయంత్రం 4.30 గంటలకు కలవబోతున్నారు. దీంతో తన రాజీనామా లేఖను సమర్పించేందుకు ఆయన ఎల్జీను కలుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ పేరును ఆప్ ప్రకటించడంతో కచ్చితంగా రాజీనామా ఇచ్చేస్తారని, ఇకపై ప్రజాక్షేత్రంలో ఉండి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పని చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి నెలలో అరెస్టైన కేజ్రీవాల్‌ రెండు రోజుల క్రితమే బెయిలుపై బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సీఎంగా బాధ్యతలు నిర్వర్తించవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. కేజ్రీవాల్ ఏకంగా తన పదవికి రాజీనామా చేసి కొత్త సీఎంగా అతిశీ మర్లీనాను ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed