Kejriwal: లారెన్స్ బిష్ణోయ్‌కు బీజేపీ రక్షణ .. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

by vinod kumar |
Kejriwal: లారెన్స్ బిష్ణోయ్‌కు బీజేపీ రక్షణ .. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఫైర్ అయ్యారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Larence Bishnoy) కార్యలాపాలను ప్రస్తావిస్తూ మండిపడ్డారు. బిష్ణోయ్ జైలు నుంచి తన పనులను నిర్వహించడం ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేజ్రీవాల్ శుక్రవారం ప్రసంగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్‌కు బీజేపీ రక్షణ కల్పిస్తోంది. లేకపోతే ఆయన జైలు నుంచి దోపిడీ రాకెట్లను ఎలా నడుపుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతీ(Sabharmathi) జైలులో ఉన్నాడని, అక్కడ నుంచి ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు క్షీణించాయని, నగరాన్ని గ్యాంగ్ స్టర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ప్రతి రోజూ బహిరంగంగానే కాల్పులు జరుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన బాధ్యతలను విస్మరించారని ఆయన వెంటనే మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. ఆయన హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఢిల్లీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా మారాయని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed