మగవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న కర్నాటక

by Seetharam |   ( Updated:2023-06-09 07:00:17.0  )
మగవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న కర్నాటక
X

దిశ,వెబ్‌డెస్క్: మగవాళ్ల కష్టాన్ని కర్నాటక ప్రభుత్వం అర్థం చేసుకుంది. తాజాగా కర్నాటక ప్రభుత్వం పురుషులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయించింది. ఈ తాజా నిర్ణయం ఈ నెల 11 నుంచి అమల్లోకి రానుంది. ఇలా మగవాళ్ల కోసం బస్సుల్లో సీట్లు కేటాయించటం దేశంలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన కర్నాటక ఆర్టీసీ.. ఇప్పుడు పురుషుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటక మొత్తం మీద రోజుకు 40 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం అవకాశం వచ్చింది కాబట్టి ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకునే పురుషులకు 50 శాతం సీట్లు కేటాయించవలసి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: స్టార్ యాంకర్ సుమ కాళ్లకు గాయాలు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

అందరూ ఎదురుచూస్తున్న అందాల పోటీలు.. ఈ సారి ఎక్కడో తెలుసా ?

Advertisement

Next Story

Most Viewed