- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నాటక రిజల్ట్: ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. ఆ పార్టీదే లీడ్!
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుండి 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు మొదటగా ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో నిలిచింది. బీజేపీ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. వరుణ నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్ధారామయ్య, శిగ్గావ్‌లో సీఎం బొమ్మె ముందంజలో ఉన్నారు. చిత్తాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే వెనుకంజలో ఉండగా.. కనకపురాలో కర్నాటక పీసీపీ డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. చెన్నపట్నలో మాజీ సీఎం కుమారస్వామి పోస్టల్ బ్యాలెట ఓట్లలో వెనుకంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తి కావడంతో అధికారులు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించారు. ఇక, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read...
కర్నాటక రిజల్ట్స్: కర్నాటక కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం